క్రీడాభూమి

విండీస్ క్రికెటర్లకు బోర్డు గుడ్ న్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్ (అంటిగ్వా), జూలై 9: ప్రపంచకప్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వెస్టిండీస్ కు క్రికెట్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే టోర్నమెంట్ అద్భు తంగా రాణించిన ఫెబియన్ అలెన్, నికో లస్ పూరన్, ఓషనె థామస్‌లకు మాత్రం క్రికెట్ వెస్టిండీస్ బోర్డు నుంచి తీపి కబురు అందింది. వీరిని బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకోనుంది. వీరితో పాటు మొదటిసారి మరికొందరికి ఈ అవకాశం కల్పించనుంది. మరోవైపు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడే ఆటగాళ్లను నాలుగు నుంచి ఎనిమిది మందికి పొడి గించి, కాంట్రాక్టును వర్తింపజేయ నుంది. ఇందులో డారెన్ బ్రేవో, షిమ్రాన్ హెట్మ యర్, కిమో పాల్‌తో పాటు కెప్టెన్ జాసన్ హోల్డర్, షై హోప్, ఆల్జరీ జోసెఫ్‌తో పాటు కీమర్ రోచ్ ఉన్నారు. క్రికెట్ వెస్టిండీస్ బోర్డు జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు మొత్తం 19 మం దికి కాంట్రాక్టు అందజేయనుంది. వీరితో పాటు 15మందితో కూడిన మహిళా జట్టు లో మరో ముగ్గురికి అవకాశం కల్పించను న్నట్లు క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమీ ఆడమ్స్ తెలిపాడు. ఆడమ్స్ మాట్లాడుతూ త్వరలోనే ఆటగాళ్లకు కాంట్రాక్టులను వర్తింపజేస్తామని చెప్పాడు.
2019-20 సెంట్రల్ కాంట్రాక్టు ఆటగా ళ్లు (అన్ని ఫార్మాట్లు): డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్మయర్, జాసన్ హోల్డర్, షై హోప్, ఆల్జరీ జోసెఫ్, కిమో పాల్, కీమర్ రోచ్.
రెడ్ బాల్ కాంట్రాక్టు: క్రెయగ్ బ్రాత్‌వైట్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, షెనాన్ గాబ్రియెల్, జోమెల్ వార్రికన్. వైట్ బాల్ కాంట్రాక్టు: ఫెబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, షెల్డన్ కాట్రియల్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, ఓషానె థామస్.