క్రీడాభూమి

నో ఫ్లై జోన్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూలై 9: మెగా టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో తలపడుతున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌కు వేదికైన మాంచెస్టర్‌లో మంగళ వారం ‘నో ఫ్లై జోన్’గా ఆంక్షలు విధించారు. అంతకుముందు మ్యాచ్‌లో లీడ్స్ వేదికగా శ్రీలంకతో తలపడిన భారత్‌కు వ్యతిరేకంగా ఆకాశంలో ‘జస్టిస్ ఫర్ కాశ్మీర్’ అనే నినా దంతో ఓ విమానం బ్యానర్‌ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ తిరి గింది. దీంతో బీసీసీఐ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. ఐసీసీ కూడా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాంచెస్టర్ వేదిక మీదుగా అధికారులు ‘నో ఫ్లై జోన్’ ఆంక్షలు విధించారు. ఈ విషయ మై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ ద్వారా తెలిపింది. సెమీ ఫైనల్స్‌తో పా టు ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈ ఆంక్షలను కొనసాగేలా చూస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇదే వేదికగా జరిగిన అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ఓ విమానం ‘జస్టిస్ ఫర్ బలుచిస్తాన్’ నినాదంతో మైదానం మీదుగా వెళ్లింది.