క్రీడాభూమి

లో స్కోరింగ్ మ్యాచ్‌లో విండీస్ ‘ఏ’పై భారత్ ‘ఏ’ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూలిడ్జి (అంటీగువా), జూలై 12: వెస్టిండీస్ ‘ఏ’తో జరిగిన అనధికార వనే్డ ఇంటర్నేషనల్‌లో భారత్ ‘ఏ’ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ (107 బంతుల్లో 77 పరుగులు), హనుమ విహారి (63 బంతుల్లో 34 పరుగులు) ఆదుకోవడంతో భారత్ ‘ఏ’ 48.5 ఓవర్లలో 190 పరుగులు చేయగలిగింది. లేకపోతే, స్కోరు మరింత దారుణంగా నమోదయ్యేది. విండీస్ ‘ఏ’ కెప్టెన్ రాస్టన్ ఛేజ్ కేవలం 19 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి, భారత్ ‘ఏ’ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. పేసర్ అకీన్ జోర్డాన్ 43 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ‘ఏ’ 35.5 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. జొనథాన్ కార్టర్ (41 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (41) జట్టును ఆదుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరిద్దరితోపాటు కారీ పియరీ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితం కావడంతో విండీస్ ‘ఏ’కు ఓటమి తప్పలేదు. భారత పేసర్ ఖలీల్ అహ్మద్ 8 ఓవర్లు బౌల్ చేసి, 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్ తలా రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ అనధికార వనే్డ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈనెల 14న అంటిగువాలో జరుగుతుంది.