క్రీడాభూమి

బిసిసిఐ అధ్యక్షుడిగా ఠాకూర్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 22: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటి వరకూ ఈ పదవికి ఎన్నికైన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ గుర్తింపు సంపాదించాడు. బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఠాకూర్ ఒక్కడే నామినేషన్ వేయడంతో, అతని ఏకగ్రీవ ఎన్నిక శనివారం నాడే ఖరారైంది. ఆదివారం జరిగిన ప్రత్యేక వార్షిక సమావేశం అతని ఎన్నిక లాంఛనమైంది. బిసిసిఐ అధ్యక్షుడు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు వేర్వేరు పదవుల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ ఎన్నికయ్యేందుకు వీలుగా మనోహర్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం అతను ఐసిసి స్వతంత్ర ప్రతిపత్తి హోదాగల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. లాయర్‌గా పేరుప్రఖ్యాతులు ఆర్జించి, తర్వాతి కాలంలో క్రికెట్ అడ్మినిస్ట్రేర్‌గా ఎదిగిన మనోహర్ బిసిసిఐ అధ్యక్షుడిగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. జగ్మోహన్ దాల్మియా గుండెపోటుతో మృతి చెందడంతో, బోర్డు అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఆ స్థానంలో మనోహర్ ఏకగ్రీవంగానే ఎన్నికయ్యాడు. పాలనపై తనదైన ముద్ర వేస్తున్న తరుణంలోనే ఐసిసి చైర్మన్ పదవి కోసం అతను బిసిసిఐ అధ్యక్షుడిగా రాజీనామా చేయడంతో మరోవసారి ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయక తప్పలేదు. సికె ఖన్నా అధ్యక్షత వహించిన ఆదివారం నాటి ఈ సమావేశంలో అధ్యక్షుడిగా ఠాకూర్, ఇప్పటి వరకూ అతను నిర్వహించిన కార్యదర్శి పదవికి అజయ్ షిక్రే ఎన్నికయ్యారు. బోర్డు వివిదాల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన తరుణంలో ఠాకూర్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడం గమనార్హం. బోర్డుపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తనని అంటున్న ఠాకూర్ ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో పట్టు సంపాదించాడు. బోర్డును పలు కేసులు వేధిస్తుండడంతో అతను ఏ విధంగా అడుగులు వేస్తాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? అన్నది ఆసక్తిని రేపుతున్నది.
సంస్కరణలు కొనసాగిస్తా..
బిసిసిఐ ప్రక్షాళనపైనే లక్ష్యంగా మాజీ అధ్యక్షుడు మనోహర్ చేపట్టిన సంస్కరణలను తాను కొనసాగిస్తానని ఠాకూర్ స్పష్టం చేశాడు. బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ ఆటగాళ్లు, అధికారులకు పరస్పర ప్రయోజనాలు చేకూర్చే అంశాలను పరిశీలించడానికి ప్రత్యేక అధికారిని నియమించడంతో ఇప్పటికే సంస్కరణల పర్వం మొదలైందని తెలిపాడు. బోర్డుకు కొత్త రూపాన్ని ఇచ్చే ప్రక్రియ మొదలైందని, ఈ దిశగా తీసుకున్న అనేక నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించాడు. 2017 వరకూ పదవిలో ఉంటానని, ఈలోగా బోర్డుకు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఠాకూర్ అన్నాడు. లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ‘సహేతుకమైన’ వాటిని అమలు చేయడంలో వెనుకంజ వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఒక సవాలని అన్నాడు. దీనిని స్వీకరించి, సమర్థంగా నిర్వహిస్తానన్న ధైర్యం తనకు ఉందని ఠాకూర్ చెప్పాడు.

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు బిసిసిఐ అధ్యక్ష పదవిలో ఉంటాడు. ఒకవేళ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాల్సి వస్తే, తన పదవీ కాలం ముగిసిన వెంటనే మళ్లీ పోటీ చేయడానికి అతను మూడేళ్లు నిరీక్షించాల్సి ఉంటుంది. పలు అంశాలపై సుప్రీం కోర్టు పదేపదే చీవాట్లు పెడుతున్నప్పటికీ తన తీరును మార్చుకోని బిసిసిఐని ఠాకూర్ ఏ విధంగా గాడిలో పెడతాడన్నది ఉత్కంఠ రేపుతోంది.

రంజీ క్రికెటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, బిసిసిఐ అధ్యక్షుడిగా ఎదిగిన వారిలో అనురాగ్ ఠాకూర్ రెండో వాడు. 1998లో రాజ్ సింగ్ దుంగార్పూర్ కూడా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతను కూడా రంజీ క్రికెటరే. సునీల్ గవాస్కర్, శివలాల్ యాదవ్ కూడా క్రికెటర్లే. తాత్కాలికంగా బోర్డు అధ్యక్ష పదవిని చేపట్టినవారే. అయితే, వీరిద్దరినీ సుప్రీం కోర్టు కేవలం ఐపిఎల్ టోర్నీ నిర్వహణకు మాత్రమే పరిమితం చేస్తూ నియమించింది. కాబట్టి, బోర్డు అధ్యక్ష పదవిని దక్కించుకున్న మాజీ క్రికెటర్ల జాబితాలో వీరు చేరరు.

* రెండు పర్యాయాలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రేమ్ కుమార్ ధమాల్ కుమారుడు అనురాగ్ ఠాకూర్. రాజకీయం అతనికి కొత్తకాదు. చాలా మంది క్రికెటర్లతో అతనికి మంచి సంబంధాలున్నాయి. అతను బిసిసిఐ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ క్రికెటర్లకు మళ్లీ జాతీయ జట్టులో స్థానం దక్కింది. 25 ఏళ్ల వయసులోవనే హిమాచల్ క్రికెట్ సంఘం (హెచ్‌పిసిఎ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఠాకూర్ ఇటీవలే లోక్‌సభలో ఒక ప్రైవేటు బిల్లు పెట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన లేదా అందుకు సహకరించిన క్రికెటర్లు, అధికారులకు కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకురావాలన్నది అతని డిమాండ్.