క్రీడాభూమి

వావ్రిన్కా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 23: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా ముందంజ వేశాడు. పలు మ్యాచ్‌లకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడగా, వాయిదా పడిన కొన్ని మ్యాచ్‌లు సోమవారం పూర్తయ్యాయి. మరికొన్ని మ్యాచ్‌లు ఆలస్యంగా జరగనున్నాయి. కాగా, తొలి రౌండ్‌లో వావ్రిన్కా 4-6, 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో లుకాస్ రసోల్‌ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వావ్రిన్కా అతి కష్టం నెగ్గి రెండో రౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో గెరెమీ చార్డీ 6-4, 3-6, 6-4, 6-2 స్కోరుతో లియోనార్డ్ మేయర్‌పై నెగ్గాడు. మిలోస్ రవోనిక్ 6-3, 6-2, 7-6 ఆధిక్యంతో జన్కో తిస్పారెవిక్‌ను, జాక్ సాక్ 6-3, 7-5, 3-6, 6-7, 6-2 తేడాతో రాబిన్ హాస్‌ను ఓడించారు. విక్టర్ ట్రోయికీ 2-6, 6-3, 5-7, 7-5, 6-3 స్కోరుతో గ్రెగర్ దిమిత్రోవ్‌పై నెగ్గాడు.
మహిళల విభాగంలో స్వెత్లానా కుజ్నెత్సొవా 4-6, 6-1, 6-4 తేడాతో యార్లొస్లావ ష్వెడోవాపై విజయం సాధించింది. డానియేలా హంచుతోవాపై మిర్జానా లుసిక్ బరోనీ 6-1, 6-2 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. నవోమీ ఒసాకా 6-4, 7-5 స్కోరుతో చెలెనా అస్టాపెన్కోపై గెలిచింది. గాబినే ముగురుజా 3-6, 6-3, 6-3 తేడాతో అన్నా కరోలిన్ షిమెడ్లోవాపై గెలుపొంది రెండో రౌండ్ చేరింది.
జొకోవిచ్ భయం!
ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను చూసి ప్రత్యర్థులు భయపడతారు. అయితే, పారిస్‌లోని రోలాండ్ గారోస్‌లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ సమీపిస్తున్న కొద్దీ ఈసారైనా అక్కడ టైటిల్ సాధిస్తానా లేదా అన్న భయం అతనిని భయపెడుతున్నది. 1969 తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకునే అవకాశాన్ని జొకోవిచ్ నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ కారణంగానే కోల్పోయాడు. ఫైనల్‌లో స్టానిస్లాస్ వావ్రిన్కా ఎవరూ ఊహించని విధంగా జొకోవిచ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లు తన ఖాతాలో చేరినప్పటికీ, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం గత 11 సంవత్సరాలు తాను చేసిన కృషి వృథా కావడంతో జొకోవిచ్ నిరాశకు గురవుతున్నారు. 12వసారి రోలాండ్ గారోస్‌లో అడుగుపెట్టనున్న అతనిని విశే్లషకులు హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు. ఈ ఏడాది అతను 40 మ్యాచ్‌లు ఆడి 37 విజయాలు సాధించాడు. కేవలం మూడు పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలవడం అతనికి అసాధ్యమేమీ కాదు. పైగా ఇటీవలే అతను వరసగా రెండోసారి స్పోర్ట్స్ అవార్డును స్వీకరించాడు. 16వ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైన అతను ‘ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్’ అవార్డును అందుకున్నాడు. అతనికి ఈ అవార్డు లభించడం వరుసగా రెండోసారికాగా, మొత్తం మీద మూడోసారి. 2012, 2015 సంవత్సరాల్లో ఇదే అవార్డుకు ఎంపికైన జొకోవిచ్ మరోసారి సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ వంటి పలువురు సెలబ్రిటీల కంటే ఎక్కువ ఓట్లు సంపాదించి అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు కాబట్టే అతనికి అవార్డు లభించింది. అతను నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినా టైటిల్‌ను సాధించలేకపోయాడు. ఈసారైనా టైటిల్‌ను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న జొకోవిచ్ తన లక్ష్యాన్ని చేరుకుంటాడా లేక జాన్ మెకెన్రో, స్ట్ఫోన్ ఎడ్‌బర్గ్, తన కోచ్ బోరిస్ బెకర్ మాదిరిగానే ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించకుండానే రిటైర్ అవుతాడా అన్నది ఉత్కంఠ రేపుతోంది. నాలుగు పర్యాయాలు యుఎస్, మూడుసార్లు వింబుల్డన్ టైటిళ్లను అందుకున్న మెకెన్రోకు ఫ్రెంచ్ ఓపెన్ అందని ద్రాక్షగానే మారింది. 1984లో ఇవాన్ లెండిల్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిన అతను రన్నర్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఎడ్‌బర్గ్ 13 పర్యాయాలు, బెకర్ తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు. కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న పీట్ సంప్రాస్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 వైఫల్యాల తర్వాత టైటిల్ అందుకున్నాడు. అతని మాదిరిగానే జొకోవిచ్ కూడా తన 12వ ప్రయత్నంలో టైటిల్ అందుకుంటాడేమో చూడాలి.

chitram స్టానిస్లాస్ వావ్రిన్కా