క్రీడాభూమి

వెన్నులో వణుకు పుట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఆగస్టు 2: యాషెస్ మొదటి టెస్టులో సెంచరీ సాధించి, జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్మిత్ తనకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మద్దతు లభించిందని, అదొక్కటే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. శతకం తర్వాత అభిమానులు చప్పట్లు కొడుతుంటే వెన్నులో వణుకు పుట్టిందన్నాడు. టెస్టుల్లో చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించడం ఆనందంగా ఉందన్నాడు. అయతే బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉండడంతో ఒకానొక దశలో క్రికెట్ అంటే విరక్తి పుట్టిందని పేర్కొన్నాడు. మళ్లీ తిరిగి మైదానంలో అడుగు పెడతానని అనుకోలేదని చెప్పాడు. ఇదిలాఉంటే యాషెస్ టెస్టు మొదటి రోజు ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ (144), చివర్లో పీటర్ సిడిల్ (44) రాణించడంతో 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. టెస్టుల్లో స్మిత్‌కిది 24 సెంచరీ కాగా, యాషెస్ సిరీస్‌లో 9వది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో సర్ డోనాల్డ్ బ్రాడ్‌మన్ 19 సెంచరీలు సాధించి మొదటి స్థానంలో ఉండగా, స్టీవ్ వా (10), స్మిత్ (9) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.