క్రీడాభూమి

న్యూట్రల్ అంపైర్లు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, ఆగస్టు 3: టెస్టు మ్యాచ్‌ల్లో, ప్రత్యేకించి యాషెస్ సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్లను నియమించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, వారి సేవలు అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్, మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో న్యూట్రల్ అంపైర్లు జోల్ విల్సన్ (వెస్టిండీస్), అలీం దార్ (పాకిస్తాన్) నిర్ణయాలు విమర్శలకు గురయ్యాయి. ఆసీస్ ఆటగాళ్లు చేసిన అప్పీళ్లను కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదని పాంటింగ్ ఆరోపించాడు. తటస్థ అంపైర్లు ఉండడం వల్లే ఇలాంటి పొరపాట్లు చోటు చేసుకుంటాయని అభిప్రాయపడ్డాడు. మెరిలెబొన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై తీవ్ర ప్రభావం చూసే ఎంసీసీ పాలక మండలిలో పాంటింగ్ సభ్యుడు. త్వరలోనే జరగబోయే ఎంసీసీ సమావేశంలో తటస్థ అంపైర్లు ఉండరాదనే అంశాన్ని అజెండాలో చేరుస్తామని అతను చెప్పాడు. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, కాబట్టి, న్యూట్రల్ అంపైర్ల అవసం ఎంతమాత్రం లేదని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్‌ఎస్) కూడా సరిగ్గా లేదని అన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అంపైర్లు యాషెస్ సిరీస్‌లో ఉంటే, తమతమ దేశాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందన్న అనుమానంతో, 2002లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తటస్థ అంపైర్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, క్రికెట్‌లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడం వల్ల, ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేని ఎన్నో విషయాల్లో రీప్లేల ద్వారా స్పష్టత వస్తున్నది. ఈ పరిస్థితుల్లో తటస్థ అంపైర్ల అవసరం లేదని వాదిస్తున్న పాంటింగ్ ప్రతిపాదనపై ఎంసీసీ పాలక మండలి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎంసీసీ ప్రతిపాదిస్తే, ఐసీ సీ తప్పక అంగీకరిస్తుందనేది వాస్తవం.