క్రీడాభూమి

భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత బౌలర్లు ఆరుగురు కనీసం ఒక వికెట్ కూల్చడం ఇది మూడోసారి. 2016లో మీర్పూర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై, 2018లో దర్బన్ మైదానంలో దక్షిణాఫ్రికాపై ఆరుగురు భారత బౌలర్లు బౌలింగ్ చేసి, ప్రతి ఒక్కరూ కనీసం ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.
*
లాడెర్‌హిల్, ఆగస్టు 3: వెస్టిండీస్‌తో శనివారం జరిగిన మొదటి టీ-20 ఇంటర్నేషనల్‌ను భారత్ కొంత కష్టంతో గెల్చుకొని, బోణీ చేసింది. నవ్‌దీప్ సైనీ 17 పరుగులకే మూడు వికెట్లు కూలగొట్టి విండీస్‌ను దారుణంగా దెబ్బతీశాడు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లతో రాణించాడు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన విండీస్ 20 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. ఒకానొక దశలో 33 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెన్యా 17.2 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. టీ-20 ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇదే అత్యల్ప స్కోరు. విండీస్ అంతకంటే తక్కువ స్కోరుకే కుప్పకూలుతుందేమోనన్న అనుమానం తలెత్తింది. కానీ, కీరన్ పొలార్డ్ ఆదుకోవడంతో విండీస్ ఆ అవమానకర పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు. పోలార్డ్ 49 బంతుల్లో 49 పరుగులు చేయగా, వికెట్‌కీపర్ నికోలస్ పూరన్ 20 పరుగులు సాధించాడు. మిగతా వారంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో, విండీస్ వంద పరుగుల మైలురాయిని కూడా చేరుకోలేకపోయింది. అయితే, ఆలౌట్‌కాకుండా, ఓవర్లను పూర్తి చేసి కొంత వరకైనా పరువును కాపాడుకుంది.
నిజానికి భారత్ ఇన్నింగ్స్ కూడా ఆరంభం నిరాశాజ నకంగా ప్రారంభమైంది. శిఖర్ ధావన్ ఒక పరుగుకే ఔట్‌క గా, సునీల్ నారైన్ వరుసగా రెండు బంతుల్లో రోహిత్ శర్మ (24), రిషభ్ పంత్ (0) వికెట్లను పడగొట్టాడు. 32 పరుగులకు భారత్ మూడు వికెట్లు కోల్పోయంది. కెప్టెన్ కోహ్లీతో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన మ నీష్ పాండే 19 పరుగులు చేసి కీమో పాల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ 19 పరుగులు చేసి, షెల్డన్ కాం ట్రెల్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్‌కు చిక్కాడు. 69 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ చేజార్చుకుంది. కృణాల్ పాండ్య 12 పరుగులకు వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (10 నాటౌ ట్), వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) మరో వికెట్ కూల కుండా భారత్‌ను లక్ష్యానికి చేర్చారు. 17.2 ఓవర్లలో ఆరు వికెట్లకు 98 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికె ట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 (నికోలస్ పూరన్ 20, కీరన్ పోలార్డ్ 49, నవ్‌దీప్ సైనీ 3.17, భువనేశ్వర్ కుమార్ 2/19, వాషింగ్టన్ సుందర్ 1/18, ఖలీల్ అహ్మద్ 1/8, కృణాల్ పాండ్య 1/20, రవీంద్ర జడేజా 1/13).
భారత్: 17.2 ఓవర్లలో 6 వికెట్లకు 98 (రోహిత్ శర్మ 24, కోహ్లీ 19, మనీష్ పాండే 19, జడేజా 10 నాటౌట్).
చిత్రం... మూడు వికెట్లు సాధించిన నవ్‌దీప్ సైనీ