క్రీడాభూమి

థాయ్‌లాండ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, ఆగస్టు 4: థాయ్‌లాం డ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో ప్రపంచ చాంపియన్లు అయన చైనా షట్లర్లు లీ జున్ హూ-యు చెన్ జోడీని సాత్విక్ సాయరాజ్-చిరాగ్ శెట్టి మట్టికరిపించారు. ఆధ్యంతం హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జోడీ 21-19, 18-21, 21-18 తేడాతో విజయం సాధించింది. ఈ వి జయంతో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నీ పురుషుల డబుల్స్‌లో టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా సాత్వి క్-చిరాగ్ జంట చరిత్ర సృష్టించారు. తొలి గేమ్‌లో 11-9తో ముందున్నా, చైనా షట్లర్లు విజృంభించి 18-18తో స్కోరు సమం చేశారు. వెంటనే తేరు కున్న భారత జోడీ గట్టి పోటీనిచ్చి 21-19తో తొలి గేమ్‌ను కైవసం చేసు కుంది. రెండో గేమ్‌లో చైనా షట్లర్లు వ్యూహాత్మకంగా ఆడడంతో భారత్ 18-21 తేడాతో కోల్పోయంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత జోడీ అంచనాలకు మించి రాణించి 21-18 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. దీంతో పురుషుల డబుల్స్‌లో సాత్విక్ జోడీ చరిత్ర సృష్టించినట్లయంది.
చిత్రం...థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీ ట్రోఫీతో సాత్విక్ సాయరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి