క్రీడాభూమి

పీఎస్‌జీ పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఆగస్టు 19: బ్రెజిల్ సూపర్ స్టార్ ఇంకా పూర్తి ఫిట్నెస్‌తో లేకపోవడంతో, అతను లేని లోటు పారిస్ సెయింట్ జర్మెయిన్ (పీఎస్‌జీ)లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఫ్రెంచ్ లీగ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో గత వారం నిమెస్‌ను 3-0 తేడాతో చిత్తుచేసిన పీఎస్‌జీ తాజా మ్యాచ్‌లో రెనెస్‌ను ఢీకొని, 1-2 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ 36వ నిమిషంలో ఎడిసన్ కవానీ పీఎస్‌జీకి తొలి గోల్‌ను అందించాడు. అయితే, ప్రత్యర్థి జట్టు గోల్ తర్వాత దాడికి ఉపక్రమించిన రెనెస్ 44వ నిమిషంలో బిబయే నియాంగ్ ద్వారా ఈక్వెలైజర్‌ను సంపాదించింది. మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే రొమైన్ డెల్ కాస్టిలో గోల్ సాధించి, రెనెస్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. ఆ జట్టు అదే తేడాతో గెలిచింది.