క్రీడాభూమి

టెస్టు క్రికెట్‌లోనూ హోరాహోరీ మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్, ఆగస్టు 20: ఇటీవల కాలంలో టెస్టు క్రికెట్‌లో పోటీతత్వం పెరుగుతున్నదని, అందుకే, ఈ ఫార్మాట్‌లోనూ హోరాహోరీ మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వెస్టిండీస్‌తో గురువారం నుంచి మొదలుకానున్న మొదటి టెస్టు కోసం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే మొట్టమొదటి టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు తలపడతాయి. రెండేళ్ల కాలంలో మొత్తం 71 టెస్టులు ఆడతారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఇలాంటి టోర్నీ వల్ల టెస్టు క్రికెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మ్యాచ్‌ల్లో ఫలితాలు వెల్లడవుతున్నాయని చెప్పాడు. గతంలో మాదిరి నీరసంగా కొనసాగే మ్యాచ్‌లు, డ్రాలు ఉండవని అన్నాడు. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌లు కొనసాగుతాయని, డ్రా కూడా అంతే పోటాపోటీగా ఉంటుందని చెప్పాడు. వెస్టిండీస్‌తో జరిగే మొదటి టెస్టుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, బ్యాటింగ్ విభాగంలో లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. తమ స్థాయికి తగినట్టు బ్యాట్స్‌మెన్ రాణించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే, జట్టులోని ప్రతి ఆటగాడికీ తన బాధ్యతలు ఏమిటో తెలుసునని, కాబట్టి, ప్రత్యేకంగా వారికి చెప్పాల్సింది ఏమీ ఉండదని స్పష్టం చేశాడు. హోం అడ్వాంటేజ్ వెస్టిండీస్ జట్టుకు ఉంటుందనే విషయాన్ని అతను అంగీక రించాడు. అయతే, అంతర్జాతీయ స్థాయ క్రికెట్ ఆడుతున్న ప్పుడు ఎక్కడైనా మ్యాచ్‌లకు సిద్ధపడి ఉండాల్సిందేనని కో హ్లీ అన్నాడు. టెస్టు ఫార్మాట్‌లో బ్యాటింగ్ ప్రమాణాలు అ త్యున్నతంగా ఉండాలని, ఇందుకోసం తామంతా ఎంతో శ్ర మిస్తున్నామని తెలిపాడు.
మానసికంగా బలంగా ఉండాలి: లారా
వెస్టిండీస్‌లో ప్రస్తుతం సమర్థులైన ఆటగాళ్లు ఎంతో మం ది ఉన్నారని ఆ జట్టు మాజీ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. అయతే, మానసికంగా బలంగా ఉండాలని, అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌పై సిరీస్ ను కైవసం చేసుకోవడం విండీస్ సామర్థ్యానికి అద్దం పడు తుందని లారా అన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌ను విండీస్ టె స్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించడాన్ని అతను గుర్తుచేశా డు. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. మానసికంగా కూడా వారిని పెద్ద మ్యాచ్‌లకు, టోర్నీలకు స న్నద్ధం చేయాల్సి ఉందన్నాడు. కౌనె్సలింగ్‌తో మంచి ఫలితా లను రాబట్టవచ్చని లారా అభిప్రాయపడ్డాడు.