క్రీడాభూమి

మళ్లీ క్రికెట్‌లోకి అంబటి రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 30: ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీ య క్రికెట్‌కు రెండు నెలల క్రితం గుడ్ బై చెప్పిన హైదరాబాదీ క్రికెటర్ అంబ టి రాయుడు తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ మేరకు 33 ఏళ్ల రాయుడు హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)కు లేఖ రాశా డు. తనకు ఇంకా క్రికెట్ ఆడాలని ఉం దని, గతంలో భావోద్వేగంతో తీసుకు న్న తన నిర్ణయాన్ని ఉపసంహరించు కుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. వచ్చే నెల 10 నుంచి హైదరాబాద్ జట్టుకు, సెలక్షన్ కమిటీ అందుబా టులో ఉంటానని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన బీసీసీఐకు చెందిన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ సభ్యుడు రత్నా కర్‌శెట్టి ఈమెయల్‌లో స్పందించాడు. రాయుడు తన నిర్ణయాన్ని ఉపసంహ రించుకుంటున్నట్లు రాసిన లేఖ తమ కు అందిందని, 2019-20 షార్ట్ ఫార్మా ట్ కోసం హెచ్‌సీఏకు అందుబాటులో ఉంటాడని లేఖలో పేర్కొన్నట్లు తెలి పాడు. అంతేకాకుండా తనకు అండగా ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు, వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌కు ఈ సందర్భంగా రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. రాయుడుని సెలక్టర్లు 2019 ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోగా, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మూడు ఫార్మట్లను చూసి విజయ్ శంకర్‌ను ఎంపిక చేసినట్లు చెప్పడంతో త్రీడీ డైనమేషన్ అంటూ ట్వీట్ చేసి సెలక్టర్ల ఆగ్రహానికి కూడా గురయ్యాడు.