క్రీడాభూమి

కోహ్లీనే నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ : భారత జట్టు కెప్టెన్, ర న్ మిషన్ విరాట్ కోహ్లీ మరో సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా టెస్టు కెప్టెన్లలో అందరికంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన సారథిగా అరుదైన ఘనత అందు కున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు.
28 విజయాలతో..
విరాట్ కోహ్లీ మొత్తం 48 మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించగా 28 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది. ఇంత కుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొత్తం 60 మ్యాచ్‌ల్లో సారథిగా వ్యవహరించగా, 27 మ్యాచుల్లో జట్టు గెలిచింది. ఇక అంతకుముందు కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్ వీరిద్దరి తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల జాబితాలో ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ 53 టెస్టు విజయాలతో ముందు వరుసలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41), వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైయవ్ లాయడ్ (36), అలెన్ బోర్డర్ (32) ఉండగా, న్యూజిలాండ్ మాజీ సారథి స్టీఫెన్ ఫ్లెమింగ్ (28)తో కలిసి కోహ్లీ (28) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ధోనీకి మించి..
ఇక భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మించి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన ముద్ర వేశాడు. ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు సాధించగా, 18 మ్యాచుల్లో జట్టు ఓడిపోయంది. మరో 15 మ్యాచులు డ్రాగా ముగిసాయ. కోహ్లీ విషయానికొస్తే 48 మ్యాచుల్లోనే ధోనీని అధిగమించాడు. ఇం దులో 28 విజయాలుండగా, 10 మ్యాచుల్లో జట్టు ఓడిపోగా, మరో 10 మ్యాచులు డ్రాగా ముగిసాయ. ఇదిలాఉంటే ధోనీ విజయాల శాతం 45 ఉంటే, కోహ్లీ విజయాల శాతం 55గా ఉండడం విశేషం. అయతే కోహ్లీకి మరింత సమయం ఉండడంతో అందరినీ అధిగమించే అవకాశాలున్నాయ.

చిత్రం... విరాట్ కోహ్లీ