క్రీడాభూమి

పాకిస్తాన్ హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా మిస్బా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 4: పాకిస్తాన్ జట్టు హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ మిస్బా- ఉల్-హక్‌ను బుధవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో లీగ్ నుంచే నిష్క్రమించడంతో మాజీలతో పాటు అభిమానుల నుంచి పెద్దఎత్తున బోర్డుపై విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. దీంతో పీసీబీ అప్పటివరకు కోచ్‌గా కొనసాగిన మికీ అర్థర్ తిరిగి కాంట్రాక్టును ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు సెలక్టర్‌గా మరో మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ కూడా తన పదవి నుంచి వైదొలిగాడు. వీరితో పాటు బౌలింగ్ కోచ్ అజార్ మహముద్, బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కు కూడా బోర్డు ఉద్వాసన పలికింది.
మూడేళ్లు.. అన్ని ఫార్మాట్లు..
నూతనంగా హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా నియామకమైన మిస్బా- ఉల్-హక్ మూడేళ్లు అన్ని ఫార్మాట్లలో ఈ పదవుల్లో కొనసాగనున్నాడు. అంతకుముందు బోర్డు సభ్యులంతా మిస్బా ప్రధాన కోచ్‌గా ఐదుగురు సభ్యులు కలిగిన కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. దీంతో పాకిస్తాన్ 30వ ప్రధాన కోచ్‌గా మిస్బా సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. పాకిస్తాన్ జట్టు విజయంతమైన టెస్ట్ కెప్టెన్‌గా మిస్బా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 75 టెస్టు మ్యాచ్‌లాడగా, 56 టెస్టులకు నాయకత్వం వహించగా 26 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఇందులో 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయ. అలాగే 162 వనే్డలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. మిస్బాతో పాటు మరో మాజీ కెప్టెన్, పేసర్ వకార్ యూనిస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించారు. వీరిద్దకీ కలిసి సెప్టెంబర్ 27నుంచి అక్టోబర్ 9 వరకు శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల వనే్డ, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదటిది కానుంది. అలాగే పాకిస్తాన్ జట్టు నవంబర్ ఆస్ట్రేలి యాలో పర్యటించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు టెస్టుల్లో 7 ర్యాంకు, వనే్డల్లో 6 స్థానంలో ఉండగా, టీ20ల్లో టాప్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మిస్బా మాట్లాడు తూ చాలాకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్‌లు గా ఉన్న వారితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందన్నాడు. ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. మా మీద అంచనాలు చాలా ఉన్నాయని తెలుసు. పాకిస్తాన్ క్రికెట్ ఎదుర్కొనే ప్రతీ సవాలుకు దీటుగా బదులిచ్చేందుకు నేను ప్రయత్నిస్తా.
చిత్రం... హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బాతో బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్