క్రీడాభూమి

లైంగిక వేధింపుల కేసులో స్విమ్మింగ్ కోచ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై గోవాకు చెందిన ఓ స్విమ్మింగ్ కోచ్‌పై వేటు పడింది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలిక సోషల్ మీడియాలో ఉంచిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆదేశాలపై గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ (జీఎస్‌ఏ)లో కోచ్‌గా పని చేస్తున్న సురజిత్ గంగూలీను అధికారులు సస్పెండ్ చేశారు. అతని వద్ద స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న 15 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్రీడల్లో ఇలాంటి సంఘటనకు తావులేదని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన నిర్ణయాలు తప్పవని కేంద్రం ఇది వరకే స్పష్టం చేసింది. సురజిత్‌ను సస్పెండ్ చేయడం ద్వారా ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా స్పష్టమైన సందేశాన్ని పంపింది. అతనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రిజిజు హామీ ఇచ్చారు. ఇలావుంటే, సస్పెన్షన్‌కు గురైన కోచ్ సురజిత్‌పై గోవా పోలీసులు రేప్ కేసు దాఖలు చేశారు. అతనిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు.