క్రీడాభూమి

రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, సెప్టెంబర్ 6: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ పట్టు బిగిస్తోంది. కెప్టెన్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో ఆతిథ్య బంగ్లాదేశ్‌కు తిప్పలు తప్పడం లేదు. ఓవర్ నైట్ స్కోరు 271 పరుగులతో రెండో రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు 342 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాట్స్‌మన్ అస్గార్ అఫ్గాన్ (92) వికెట్‌ను త్వరగానే కోల్పోయనా, కెప్టెన్ రషీద్ ఖాన్ (51), వికెట్ కీపర్ అఫ్సర్ జజై (41)తో కలిసి రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు మొదటి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. అహ్మాద్ జై వేసిన నాలుగో బంతికి ఓపెనర్ షాద్మన్ ఇస్లాం (0) పరుగులేమీ చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సౌమ్యా సర్కార్ (17), లిటన్ దాస్ (33) నిరాశ పరిచినా, మమినుల్ హక్ (52) ఆకట్టుకున్నాడు. అర్ధ సెంచరీ సాధించిన కొద్దిసేపటికే హక్‌ను రషీద్ ఖాన్ పెవిలియన్‌కు పంపగా, స్టార్ ఆల్‌రౌండర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (11), వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ (0), మహ్మదుల్లా (7), మెహిడీ హసన్ (11)లను కూడా రషీద్ ఖాన్ వెంటవెంటనే పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ 8 వికెట్లను కోల్పోయ ఆట ముగిసే సమయానికి 194 పరుగులు చేసింది. క్రీజులో మోసద్దీక్ హుస్సేన్ (44), తైజుల్ ఇస్లాం (14) ఉన్నాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు తీయగా, మహ్మద్ నబీ 2, యామిన్ అహ్మద్‌జై 1 వికెట్ పడగొట్టారు.