క్రీడాభూమి

అఫ్గాన్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్, సెప్టెంబర్ 9: పసికూన జట్టుగా ప్రపంచ క్రికెట్‌లో అడుగుపెట్టిన అఫ్గానిస్తాన్ జట్టు సంచలనాని కి మారుపేరుగా మారింది. గతంలో మేటి జట్లకు దీటు గా పోటినిచ్చి, తామింకా పసికూనలం కాదని చాటి చెప్పింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 224 పరుగుల భారీ విజయం సాధించి సంచలనం సృష్టించింది.
చిట్టగాంగ్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం ఓవర్ నైట్ స్కోరు 136 పరు గులతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మరో 37 పరుగులు మాత్రమే చేసి చివరి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. దీంతో 173 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్థి జట్టుకు 224 పరుగుల భారీ విజయాన్ని అందించింది. చివరిరోజు పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించినా అఫ్గా నిస్తాన్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. బం గ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (44)ను జహీర్ ఖాన్ పెవిలియన్‌కు పంపగా, మెహిడి హసన్ (12), తైజుల్ ఇస్లాం (0), సౌమ్యా సర్కార్ (15) వికెట్లను కెప్టెన్ రషీద్ ఖాన్ పడగొట్టడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 6 వికెట్లు తీయగా, జహీర్ ఖాన్ 3, మహ్మద్ నబీ 1 వికెట్ పడగొట్టారు. ఏకైక టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లతో పాటు ఒక అర్ధ సెం చరీని సాధించిన అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. మరో వైపు ఈ విజయంతో అప్గానిస్తాన్ జట్టు టెస్టులో రెండో విజయాన్ని నమోదు చేసినట్లయంది. ఇదే ఏడాది మా ర్చిలో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో అఫ్గా న్ జట్టు టెస్టు క్రికెట్‌లో మొదటి విజయాన్ని అందుకు న్న విషయం తెలిసిందే. మరోవైపు కెప్టెన్ రషీద్ ఖాన్ అత్యంత పిన్న వయసులో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించగా, విజయాన్ని అందించి కూడా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చిత్రం...మహ్మద్ నబీతో కలిసి ట్రోఫీని అందుకుంటున్న అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్