క్రీడాభూమి

రాఫెల్‌దే టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్ : హోరా హోరీగా సాగిన యూఎస్ ఓపెన్ పురు షుల సింగిల్స్ ఫైనల్‌లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. రష్యా ఆటగాడు, ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడిం చి నాలుగో సారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్‌లో 19వ గ్రాండ్ స్లామ్ టైటి ల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ ఫై నల్లో అడుగుపెట్టిన మెద్వెదేవ్ ఆధ్యం తం ఆకట్టుకున్నాడు. తొలి రెండు సెట్ల ను కోల్పోయనా గట్టి పోటీ నిచ్చాడు. ఆ తర్వాత విజృంభించి వరుసగా మూడు, నాలుగు సెట్లను దక్కించుకొని ఒకానొ క దశలో నాదల్‌కు ముచ్చెమట లు పట్టించాడు. ఇక చివరిదైన ఐదోసెట్‌లో రాఫెల్ తిరిగి పుంజుకోవడంతో మెద్వెదే వ్‌కు ఓటమి తప్పలేదు. 4.50 నిమిషాల పాటు సాగిన ఆట అభిమానులను ఉత్కంఠతకు గురిచేసింది.
33 ఏళ్లలో అసాధారణ ఆట..
రాఫెల్ నాదల్ 33ఏళ్లలోనూ అసాధారణ ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ వయస్సులోనూ టైటిల్ నెగ్గి తన ఆటతీరు తో వేడి తగ్గలేదని నిరూపించాడు. గతంలో (2010, 2013, 2017)లో యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన స్పెయన్ బుల్ మరోసారి తనదైన శైలిలో ఆడి నాలుగో సారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2011 యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన నాద ల్, తన కెరీర్‌లో ఇప్పటివరకు 27వ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన రాఫెల్ 19 ఫైనల్స్‌లో విజయం సాధించి, 8 ఫైనల్స్‌లో ఓడిపోయాడు. 30వ యేటాలో అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్ టైటిల్స్ నెగ్గి రికార్డు సృష్టించాడు. నాదల్ కంటే ముందు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్, రొడ్ లావెర్, కెన్ రోజ్‌వాల్ 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు.
చిత్రం...మ్యాచ్ అనంతరం రన్నరప్ ట్రోఫీతో డానిల్ మెద్వెదేవ్, టైటిల్ విజేత రాఫెల్ నాదల్. ఈ మ్యాచ్‌లో విజేత నాదల్‌కు 38,50,000 డాలర్లు (రూ.27 కోట్ల 59 లక్షలు), రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ.13 కోట్ల 62 లక్షలు) ఫ్రైజ్ మనీగా అందుకున్నారు.