క్రీడాభూమి

‘జికా’ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 29: సెరెనా విలియమ్స్‌ను జికా వైరస్ భయం వెంటాడుతున్నది. ఆగస్టులో రియో ఒలింపిక్స్ జరగనుండగా, అక్కడ తీవ్రమవుతున్న జికా వైరస్ సమస్య ఆందోళన కలిగిస్తున్నదని సెరెనా చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను ఓడించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ బ్రెజిల్‌ను జికా వైరస్ కుదిపేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా జికా వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానాన్ని ఆక్రమించిందని ఆమె పేర్కొంది. అందుకే బ్రెజిల్‌లో జరిగే ఒలింపిక్స్‌కు వెళ్లడానికి చాలా మంది వెనుకాడుతున్నారని పేర్కొంది. ఒలింపిక్స్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి బ్రెజిల్ ప్రభుత్వం భరోసా ఇవ్వాలని సూచించింది. అదే విధంగా జికా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ వైరస్ పట్ల ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది.