క్రీడాభూమి

లంకకు ఆండర్సన్ చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీట్, మే 30: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును తొమ్మిది వికెట్ల తేడాతో గెల్చుకున్న ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు కూల్చి లంకను దారుణంగా దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లకు 498 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లో 475 పరుగులు సాధించి, ఇంగ్లాండ్ ముందు 79 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ చేజార్చుకొని ఛేదించింది.