క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ క్వార్టర్స్‌కు ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 30: బ్రిటన్ ఆశా కిరణం, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఫ్రెండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 33 ఏళ్ల ముర్రే ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జాన్ ఇస్నర్‌ను 7-6, 6-4, 6-3 తేడాతో ఓడించి, కెరీర్‌లో ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను రిచర్డ్ గాస్క్వెట్‌తో తలపడతాడు. మరో ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో గాస్క్వెట్ 6-4, 6-2, 4-6, 6-2 స్కోరుతో ఐదో సీడ్, జపాన్ హీరో కెయ్ నిషికొరీని ఓడించాడు. స్థానికుడైన గాస్క్వెట్‌కు అభిమానుల మద్దతు లభించడం అదనపు బలాన్నిస్తోంది. కాగా, ఇప్పటి వరకూ కెరీర్‌లో ముర్రే, గాస్క్వెట్ 10 పర్యాయాలు ఢీకొన్నారు. ముర్రే ఏడు విజయాలను నమోదు చేయగా, గాస్క్వెట్ మూడుసార్లు గెలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్ చేరిన గాస్క్వెట్ ఎంత వరకు ముర్రేకు గట్టిపోటీనిస్తాడన్నది అనుమానమే.
డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కాతో తలపడే అవకాశాన్ని అల్బర్ట్ రామోస్ వినోలాస్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కెరీర్‌లో ఎన్నడూ అతను ఒక మేజర్ టోర్నీలో రెండు రౌండ్ దాటలేదు. 2011 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎప్పుడూ ఒక్క మ్యాచ్‌ని కూడా గెల్చుకోలేదు. కానీ, ఈసారి అతను అనూహ్యంగా క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ మిలోస్ రవోనిక్‌పై అతను 6-2, 6-4, 6-4 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరిన బ్రిటన్ ఆటగాడు
ఆండీ ముర్రే