క్రీడాభూమి

ఎరాంగ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీట్, మే 31: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షామింద ఎరాంగ బౌలింగ్ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి ఫిర్యాదు అందింది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అనుమానాన్ని ఫీల్డ్ అంపైర్లు వ్యక్తం చేశారని, లిఖిత పూర్వక ఫిర్యాదును అందించారని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఐసిసి నిబంధనల ప్రకారం బౌలింగ్ చేసే సమయంలో బౌలర్ చేతి వంపు 15 డిగ్రీలకు మించి ఉండకూడదు. కానీ, ఎలాంగ బంతులు వేసే సమయంలో అంత కంటే ఎక్కువగా చేయి వంగుతున్నదని అంపైర్లు ఫిర్యాదు చేశారు. కాగా, అతను రెండు వారాల్లోగా బయోమెట్రిక్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అక్కడ క్లీన్ చిట్ లభిస్తేనే అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ విఫలమైతే, పునరావాస శిబిరంలో పాల్గొని, తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోవాలి. ఇలావుంటే, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకుంది. ఎలాంటి ప్రాధాన్యం లేని మూడో టెస్టులో ఎలాంగ పాల్గొనవచ్చు. అయితే, అతనికి విశ్రాంతినిస్తారా లేక మ్యాచ్‌లో ఆడిస్తారా అన్నది చూడాలి.