క్రీడాభూమి

ప్రొ కబడ్డీ ఎథిక్స్ కమిటీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 2: ప్రొ కబడ్డీ ఎథిక్స్, గవర్నెస్ కమిటీ ఖరారైంది. నాలుగో సీజన్‌కు గాను ఈ కమిటీలో ఢిల్లీ, మద్రాసు హైకోర్టులకు న్యాయమూర్తిగా సేవలు అందించి రిటైరైన ఎపి షా, మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎఎన్ రాయ్ సభ్యులుగా ఉంటారు. కమిటీలో దీపక్ జాకబ్, చారు శర్మ, ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామిలకు కూడా ఈ కమిటీలో స్థానం లభించింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న షా చేరికతో ఈ కమిటీ ప్రాధాన్యం పెరిగింది. కాగా, తనపై నమ్మకంతో ప్రొ కబడ్డీ అధికారులు అప్పచెప్పిన బాధ్యతను సమర్థంగా నిర్వహించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షా అన్నాడు. బిసిసిఐ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న తాను ఈ అదనపు బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తానని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు.