క్రీడాభూమి

టాప్ ర్యాంకు కోల్పోయిన మంధాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, అక్టోబర్ 15: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగు తున్న టీమిండియా ఓపెనర్ స్మృతీ మంధాన తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జాబితాలో టాప్ స్థానాన్ని కోల్పోయింది. కాలి బొటనవేలి గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తప్పుకో వడంతో టాప్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్ అమీ సత్తర్‌వైట్ టాప్‌లో కొనసాగుతుం ది. స్మృతీ మంధాన 755 పాయంట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్ర 7వ స్థానానికి దిగ జారింది. హర్మన్‌ప్రీత్‌కౌర్ 17వ స్థానం లో నిలిచింది. మరోవైపు బౌలింగ్ విభా గంలోనూ జులాన్ గోస్వామి, శిఖా పాం డే, పూనమ్ యాదవ్ వరుసగా 6, 8, 9 స్థానాలకు దిగజారారు. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తీ శర్మ మూడో స్థానంలో కొనసాగుతుండగా, శిఖా పాండే టాప్- 10లో చోటు దక్కించుకుంది.
*చిత్రం... స్మృతీ మంధాన *మిథాలీ రాజ్