క్రీడాభూమి

నాకూ భావోద్వేగాలు ఉంటాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అందరిలాగే మైదానంలో అసహనం, కోపం తనకీ వస్తాయ ని టీమిండియా వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నా డు. కానీ భావోద్వే గాలను నియంత్రించుకోగలనని పేర్కొన్నా డు. మాస్టర్ కార్డ్ ప్రచార కార్యక్రమంలో భా గంగా ధోనీ మీడియాతో మాట్లాడాడు. అందిలాగే తనకూ భావోద్వేగాలుంటాయని, అయతే నేను ఇతరులకంటే బాగా నియం త్రించుకుం టానని చెప్పాడు. మైదానంలో చాలాసార్లు నిరాశకు గురైనా, వాటికంటే జట్టును ముం దుకు నడిపించడమే ముఖ్యం కావడంతో భావోద్వేగాలను అధిగమించి మ్యాచ్‌పై దృష్టిసా రిస్తానని పేర్కొన్నాడు. క్రికెట్‌లో ఫార్మాట్లను బట్టి నిర్ణయాలు తీసు కోవాలన్నాడు. టెస్టులో రెండు ఇన్నింగ్‌లు ఉండడంతో నిర్ణయాలు తీసుకోవడానికి సమ యం ఉంటుందని, కానీ వనే్డ, టీ20ల్లో క్షణా ల్లోనే తీసుకోవాలన్నాడు. కొన్ని పొరపాట్లతో ప్రణాళికలు ఫలించకపోయనా, ప్రత్యర్థిపై గెల వడమే ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోనీ భా రత ఆర్మీకి సేవల చేసేందుకు క్రికెట్‌కు కొద్ది కాలం దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రి కాతో సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేని విషయం తెలిసిందే.
*చిత్రం...డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘మాస్టర్ కార్డ్ టీం క్యాష్‌లెస్ ఇండియా’ ప్రారంభోత్సవంలో మాస్టర్ కార్డ్ అరి సర్కార్, ఆసియా ఫసిపిక్ కో ప్రెసిడెంట్, సీఐఐటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.