క్రీడాభూమి

టెస్టులను బతికించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 2: టెస్టు క్రికెట్‌ను బతికించుకోవాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ అభిప్రాయపడ్డాడు. ఇందుకుగాను పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకొని, వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. లండన్‌లో జరిగే ఐసిసి క్రికెట్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రిచర్డ్‌సన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా సభ్యదేశాల్లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రసార హక్కులతో తగినంత ఆదాయం లభించడం లేదని అన్నాడు. దీనితో టెస్టు సిరీస్‌లతో నష్టాలే తప్ప లాభం ఉండడం లేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు క్రికెట్‌కు ఆదరణ క్రమంగా తగ్గిపోతున్నదని తెలిపాడు. ఈ ఫార్మెట్ దానంతట అదే బతుకుతుందన్న వాదనను పక్కకుపెట్టి, అభివృద్ధికి కృషి చేయాలని అన్నాడు. టెస్టుల్లో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా టెస్టు సిరీస్‌లకు, క్రికెటర్లకు ప్రోత్సహాలను ఇవ్వాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. క్రికెట్ కమిటీ సమావేశాల్లో ఈ అంశాలను చర్చిస్తామని అన్నాడు.
అమీర్‌కు మద్దతు
ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలి, జైలు శిక్షను, సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌కు రిచర్డ్‌సన్ మద్దతు ప్రకటించాడు. మళ్లీ పాక్ జాతీయ జట్టులో స్థానం సంపాదించిన 24 ఏళ్ల అమీర్ తన జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 2010 టూర్‌లో భాగంగా లార్డ్స్ టెస్టులో బుకీల నుంచి ముడుపులు తీసుకొని, ఉద్దేశపూర్వకంగా నోబాల్స్ వేసిన అమీర్‌పై బ్రిటన్ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. అతనితోపాటు అప్పటి పాక్ కెప్టెన్ సల్మాన్ బట్, మరో పేసర్ మహమ్మద్ ఆసిఫ్ కూడా జైలు శిక్షను అనుభవించారు. ఐసిసి ఆదేశాల ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఈ ముగ్గురు క్రికెటర్లపై నిషేధం విధించింది. ఆ గడువు పూర్తయిన తర్వాత అమీర్‌ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకున్న జాతీయ సెలక్టర్లు మిగతా ఇద్దరిని పక్కకు పెట్టారు. ఇలావుంటే, ఇంగ్లాండ్‌లోనే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన అమీర్‌కు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసాను మంజూరు చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. అయితే, అమీర్‌ను ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించకపోవడానికి ఎలాంటి కారణాలు లేవని రిచర్డ్‌సన్ వ్యాఖ్యానించాడు. ఒకసారి తప్పు చేసినంత మాత్రాన వారిని ఎల్లప్పుడూ దోషులుగానే చూడడం సబబు కాదని అన్నాడు. అమీర్ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇంగ్లాండ్ పర్యటనకు ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చని చెప్పాడు.

chitram రిచర్డ్‌సన్