క్రీడాభూమి

సర్ఫరాజ్ అహ్మద్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, అక్టోబర్ 18: పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉద్వాసన పలి కింది. జట్టు కు టెస్ట్ కెప్టెన్‌గా అజార్ అలీని, టీ20 కెప్టెన్‌గా బాబర్ అజా మ్ నియమిస్తూ శుక్రవారం అధికారి కంగా ప్రకటించింది. అయతే వనే్డలకు మాత్రం కెప్టెన్ ఎవరనేది వెల్లడించ లేదు. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ లో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిం దే. కనీసం గ్రూప్ స్టేజీ కూడా దాటలే దు. దీంతో టోర్నీ నుంచి బయట కొ చ్చాక కోచ్‌ను కూడా మార్చింది. విదేశీ కోచ్ వద్దనుకొని మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్‌ను చీఫ్ సెలక్టర్‌తో పాటు హెడ్ కోచ్‌గా నియమించిన వి షయం తెలిసిందే. తాజాగా స్వదేశం లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లోనూ సర్ఫరాజ్ సేన విఫ లమైంది. ఈ సిరీస్‌లో శ్రీలంక యువ ఆటగాళ్ల తో బరిలోకి దిగి పాక్‌ను వైట్ వాష్ చేసింది. దీంతో ఆ దేశ అభిమానుల నుంచి పాకిస్తాన్ జట్టు ఘోర ప్రతిఘ టన ఎదుర్కొంటుంది. దీంతో పీసీబీ సమావేశమై కెప్టెన్‌గా సర్ఫరా జ్ అహ్మ ద్‌ను తొలగించింది. అంతేకాకుండా జట్టు నుంచి కూడా ఉద్వాసన పలికిన ట్లు తెలుస్తోంది. అయతే వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉండ డంతోనే పీసీబీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సోమవారం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టును ప్రకటించే అవకాశ ముంది. అలాగే వ చ్చే ఏడాది జూలై వరకు వనే్డలు ఆడ కూడదని నిర్ణయంచుకుంది. ఈ విష యమై పీబీసీ చైర్మన్ ఎహసన్ మణి మాట్లాడుతూ కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను పక్కన బెట్టడం బాధకరమే అయనా జట్టు ప్రయోజానలే ముఖ్యమ న్నారు. సర్ఫరాజ్ దేశవాళి క్రికెట్‌లో రాణించి, తప్పకుండా జట్టుకు ఆడతాడని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ సంద్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ జట్టును ఉ న్నత స్థాయకి తీసుకెళ్లినందుకు గ ర్వంగా ఉందన్నాడు. నా ఈ ప్రయా ణంలో సహచరులు, కోచ్‌లు, సెలక్టర్ల కు కృతజ్ఞతలు చెబుతున్నాన న్నాడు. అజార్ అలీ, బాబర్ ఆజామ్‌లకు శు భాకాంక్ష లు. వారు జట్టును మరింత ధృడంగా మారుస్తారని ఆశిస్తున్నట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. మరోవైపు టీ20 కెప్టెన్ బాబర్ అజా మ్ మాట్లా డుతూ సర్ఫరాజ్ అహ్మద్ సృష్టించిన రికార్డులను కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2020 ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు బాబర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నా డు. టెస్ట్ కెప్టెన్ అజార్ అలీ మాట్లాడు తూ పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవ డం కంటే గౌరవం మరొ కటి లేదన్నా డు. జట్టును ముందుండి విజయ పథంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.