క్రీడాభూమి

ఫెదరర్ అరుదైన ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాండ్ స్లామ్ రారాజు రోజర్ ఫెదరర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 1500 సింగిల్స్ పోరు ఆడేందుకు సిద్ధమయ్యాడు. 38 ఏళ్ల ఫెదరర్ ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో పాటు మొత్తం 102 ఏటీపీ టూర్ టైటిళ్లను నెగ్గి రికార్డు సాధించిన విషయం తెలిసిందే. బస్సెల్ టూర్ టోర్నీలో తొమ్మిది సార్లు టైటిల్ నెగ్గగా, పదోసారి టైటిలో పోరులో నిలిచాడు. ఇందులో భాగంగా తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన క్వాలిఫయర్ పీటర్ గోజోవిక్‌తో తలపడనున్నాడు. ఇదిలాఉంటే ఈ సీజన్‌లో ఫెదరర్ 47 విజయాలు సాధించగా, కేవలం ఎనిమిదింటిలో మాత్రమే పరాజయం పాలయ్యాడు.

*చిత్రం...గ్రాండ్ స్లామ్ రారాజు రోజర్ ఫెదరర్