క్రీడాభూమి

పసిడితో మెరిసిన శివథాప, పూజారాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, అక్టోబర్ 31: ఒలింపిక్ టెస్టు ఈవెంట్ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. శివథాప (63 కేజీలు), పూజా రాణి (మహిళల 75 కేజీలు) పసిడి పథకాలను అందుకు న్నారు. అశీష్ (69 కేజీలు) రజతంతో మెరిశాడు. ఈ పోటీల్లో భారత బాక్స ర్లు మొదటి నుంచీ సత్తా చాటారు. ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు సాధించి శివథాప ఫైనల్‌లో కజకిస్థాన్ జాతీయ చాంపియ న్, ఆసియా కాం స్య పతక విజేత సనటాలి టోల్తయేవ్ ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. థాప ప్రస్తుతం జాతీయ చాంపియన్. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గతంలో కాంస్య పతక విజేత. మహిళల 75 కిలోల ఫైనల్‌లో పూజ తన ప్రత్యర్థి కైట్లిన్ పార్కర్ (ఆస్ట్రేలియా)ను ఓడిం చింది. జపాన్ బాక్సర్ సెవాన్ ఒక జావా చేతిలో ఓడి అశీష్ (69 కిలోలు) రజతానికి పరిమితమయ్యాడు. అంత కుముందు తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రాన్‌జిత్ కౌర్ (60 కేజీలు) సమిత్ సంగ్వాన్ (91 కేజీలు), వహ్లింపుయా (75 కేజీలు) సెమీ ఫైనల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు.