క్రీడాభూమి

తెలిసి కూడా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయకి చేరడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అయతే గత కొద్దిరోజులుగా పరిస్థితి ఆందోళ నకరంగానే ఉన్నా బీసీసీఐ (్భరత్ క్రికెట్ కం ట్రోల్ బోర్డు) ఎలా మ్యాచ్‌ను నిర్వహిస్తుందం టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. మామూ లుగానే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ.. దానికి తోడు శీతకాలంలో అది రెట్టింపు స్థాయలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ పెద్దలు ఎలా ముందు కొచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్ల క్రితమే..
రెండేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో తీవ్రంగా ఇబ్బందులు పడింది. చివరికి ఆట గాళ్లు శ్వాస తీసుకునేందుకూ ఇబ్బందులు పడ్డారంటే పరిస్థితి ఎలా ఉండేదో అంచనా వేయవచ్చు. అప్పటి సిరీస్‌లో కొంతమంది క్రికెటర్లు మైదానంలోనే వాంతు లు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు వాయు కాలుష్యంపై పర్యావరణ వేత్తలు వారించినా.. మాజీ క్రికెటర్లు హెచ్చరించినా మ్యాచ్ నిర్వహణకే బీసీసీఐ పెద్దలు మొగ్గుచూపడం విమర్శలకు దారితీస్తోంది. ఇదిలాఉంటే ఇటీవ ల బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సౌర వ్ గంగూలీ మ్యాచ్ జరుగుతుందని తేల్చి చెప్పడం గమనార్హం.
మాస్కులతోనే..
మరోవైపు ఆదివారం జరిగే టీ20 కోసం ఇరు జట్ల ఆటగాళ్లు మాస్కులను ధరించి మైదానంలో ప్రాక్టీస్ చేశారు. దీనిపై బంగ్లా క్రికెటర్లు కొంతమంది పెదవి విరుస్తున్నా, ఆ జట్టు కోచ్ మాత్రం గొంతు నొప్పి సమస్యలు మినహా చనిపోయేంత ప్రమాదకర పరిస్థితు లు లేవని వ్యాఖ్యానించడం కొసమెరుపు.