క్రీడాభూమి

వచ్చే ఐపీఎల్‌లో పవర్ ప్లేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో ఇప్పటికే క్రికెట్ ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పు కున్న బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) మరో ప్రయోగానికి సిద్ధమైం ది. తాజాగా వచ్చే సీజన్ ఐపీఎల్‌లో ప్రయోగం చేపట్టేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ తాజా ప్రయోగంతో క్రికె ట్ సరికొత్త పుంతలు తొక్కు తుందన డంలో ఎలాంటి సందేహం లేదు.
ఏమిటీ పవర్ ప్లేయర్..
పవర్ ప్లేయర్ అంటే ఒక ఆట గాడిని జట్టు అవసరాల్ని బట్టి ఏ దశ లోనైనా సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగిం చే సరికొత్త విధానం. అదే సమయం లో బీసీసీఐ తుది జట్టును ప్రకటించే ముందు 11 మంది ఆటగాళ్లకు బదు లు 15 మందికి పెంచే విధంగా కసర త్తులు ప్రారంభించింది. అంటే తుది జట్టులో అడేది 11 మందే అయనా, మిగతా నలుగురినీ సబ్‌స్టిట్యూట్‌గా వినియోగించుకోవచ్చు అన్నమాట. దీంతో ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని దింపడానికి వెసులుబాటు కుదురుతుంది.
ఏ సమయంలోనైనా ..
పవర్ ప్లేయర్ గురించి బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లా డుతూ వచ్చే ఐపీఎల్‌లో తుది జట్టును 11మందితో కాకుండా 15 మందితో కూడిన జట్టును సిద్ధం చేసుకునే వెసు లుబాటు చేసుకునే దానిపై కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే 15 మందితో జట్టును ప్రకటించుకోవడమే కాకుం డా, ఇందులో ఒక ఆటగాడు సబ్‌స్టి ట్యూట్‌గా బరిలోకి దిగొచ్చన్నాడు. అయతే వికెట్ పడిన సమయమా? చివరి ఓవరా అనేది కాకుండా ఏ సమ యంలోనైనా అతడిని జట్టు అవసరాల కోసం వినియోగించుకోవచ్చని చెప్పాడు. ఇది వచ్చే ఏడాది ఐపీఎల్ నాటికి సిద్ధం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. దీనిని తొలు త దేశవాళీ లీగ్ అయన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలిం చాలను కుంటున్నట్లు తెలిపాడు.