క్రీడాభూమి

షూటింగ్‌లో 13వ ఒలింపిక్ కోటాను సాధించిన టీనేజర్ తోమర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, నవంబర్ 10: ఆదివారం నాడిక్కడ జరిగిన 14వ ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారతీయ టీనేజ్ కుర్రాడు ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ కాంస్య పతకాన్ని సాధించాడు. తద్వారా 13వ ఒలంపింక్ కోటాను తోమర్ కైవసం చేసుకున్నాడు.
పురుషుల విభాగంలో 50 మీటర్ల రైఫిల్-3 పొజిషన్స్‌లో ఈ 18ఏళ్ల తోమర్ దేశానికి ఈ విశిష్ట ఘనతను సాధించిపెట్టాడు. ఎనిమిది మంది క్రీడాకారులతో కూడిన ఫైనల్స్‌లో తోమర్ 449.1 పాయింట్లు కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో బంగారు పతకం సాధించిన కొరియాకు చెందిన కిం జోంగ్‌యెన్ 459.9 పాయింట్లు సాధించాడు. అలాగే చైనాకు చెందిన జోంగావ్ జారో 459.1 పాయింట్లు సాధించాడు. కాగా ఈ ఈవెంట్‌లో తోమర్ అద్భుత ప్రతిభతో ఫైనల్స్‌కు చేరాడు. మొత్తం 120 షాట్ల ద్వారా 1168 స్కోర్ సాధించి తోమర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. కాగా ఈ ఈవెంట్‌లో మొత్తం మూడు కోటాలను నిర్వాహకులు ఆఫర్ చేశారు. కాగా 2012లో లండన్ ఒలంపిక్స్‌లో భారత్ మొత్తం 11 మంది షూటర్లను పోటీల్లోకి దింపింది. అలాగే 2016లో రియో డీ జానియారోలో జరిగిన ఒలంపిక్ పోటీల్లో 12 మంది భారత షూటర్లు పాల్గొన్నారు. ఈక్రమంలో మధ్యప్రదేశ్ ఖరంగోన్ జిల్లా రతన్‌పూర్ గ్రామానికి చెందిన తోమర్ జూలైలో జరిగిన పురుషుల రైఫిల్-3 పొజిషన్స్‌లో జూనియర్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జర్మనీలో సుహీ వేదికగా జరిగిన ఈ ‘ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ పోటీల్లో’ మెడల్స్ జాబితాలో అగ్రభాగాన నిలిచేందుకు తోమర్ ప్రతిభ దోహద పడింది. కాగా 3పి పొజిషన్స్‌లో కోటా స్థానాన్ని కైవసం చేసుకున్న వెటరన్ సంజీవ్ రాజ్‌పుత్ తర్వాత ఈ ఘనత సాధించిన రేండో భారతీయుడిగా తోమర్ నిలిచాడు. ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇతను 2015లో తొలిసారిగా బోపాల్‌లో జరిగిన క్రీడాశిబిరంలో సుమాషిరూర్ వద్ద శిక్షణ పొందిన జూనియర్ జట్టులో ఒకడిగా ఎంపికయ్యాడు. కోచ్‌లు ఇతన్ని అగ్రభాగాన నిలుపగా, సీనియర్ల విభాగంలో తోమర్ తాజాగా తొలిసారిగా విశిష్ట ఘనతను నమోదు చేశాడు.