క్రీడాభూమి

రాణించిన దీప్తిశర్మ, షఫాలీ వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయంట్‌లూసియా, నవంబర్ 11: వెస్టిండీస్ పర్యటనలో భారత మహిళా క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొన సాగుతోంది. ఇప్పటికే వనే్డ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా టీ20లోనూ అదరగొడుతోంది. ఆది వారం రాత్రి జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంత కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయ 103 పరుగులు చేసింది. చెడియాన్ నేషన్ (32), హేలీ మాథ్యూస్ (23) మినహా మరెవ్వరూ చెప్పుకోదగిన స్కోరు సాధించలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోగా, శిఖా పాండే, రాధా యాద వ్, పూజా వస్టాకర్ ఒక్కో వికెట్ పడ గొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 10,3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధిం చింది. ఓపెనర్లు ఫషాలీ వర్మ (69, నాటౌట్) అర్ధ సెంచరీకి తోడు, స్మృతీ మంధాన (30, నాటౌట్) రాణించారు. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడా తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఈ నెల 14న జరగనుంది.
*చిత్రం...వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా జట్టు