క్రీడాభూమి

హోప్స్ నిలబెట్టాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: అప్గానిస్తాన్‌తో జరిగిన చివరి వనే్డలో షై హోప్ సూపర్ సెంచరీతో కరేబి యన్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు వనే్డల సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ జట్టు అస్గార్ అఫ్గాన్ (86), మహ్మద్ నబీ (50, నాటౌట్), హజ్రతుల్లా జజై (50) రాణిం చడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయ 249 పరుగులు చేసింది. కిమో పాల్ మూడు వికెట్లు పడగొట్టగా, అల్జారీ జోసెఫ్ 2, రోమారియో షెఫర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ షై హోప్ (109, నాటౌట్) సూపర్ సెంచరీకి తోడు రోస్టన్ ఛేజ్ (42, నాటౌట్), బ్రెండన్ కింగ్ (39) రాణించడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది.

*చిత్రం...షై హోప్ (109, నాటౌట్)