క్రీడాభూమి

షాదత్ హుస్సేన్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, నవంబర్ 18: బంగ్లా మాజీ పేసర్ షాదత్ హుస్సేన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఏడాది నిషేధం విధించింది. సోమవారం ఢాకా డివిజన్, కుల్నా డివిజన్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భాగంగా షాదత్ సహచర ఆటగాడు అరాఫత్ సన్నీపై దాడికి దిగాడు. దీంతో బీసీబీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 4 నిబంధన ప్రకారం షాదత్ హుస్సేన్‌పై ఏడాది నిషేధం విధించింది. దీంతో షాదత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయతే షాదత్ బంతిని ఒకేవైపు షైన్ చేయడంతో సన్నీ అలా చేయొద్దంటూ సూచించాడు. దీంతో కోపంతో అతడిపై షాదత్ దాడికి దిగడంతో మిగతా ఆటగాళ్లు అడ్డుకున్నారు. అనంతరం షాదత్ మాట్లాడుతూ తనను పదేపదే బంతిని షైన్ చేయొద్దు అనడమే కాకుండా, ఇంకేందో అనడంతోనే దాడి చేసినట్లు చెప్పుకొచ్చాడు.