క్రీడాభూమి

టీమిండియా కోచ్ పదవికి రవిశాస్ర్తీ దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్ర్తీ ఇప్పుడు కోచ్ పదవికి దరఖాస్తు చేశా డు. జట్టు డైరెక్టర్‌గా అతని కాంట్రాక్టు ఇటీవలే పూర్తయంది. అదే విధంగా సపో ర్టింగ్ స్టాఫ్ సంజయ్ బంగార్, రామకృష్ణన్ శ్రీధర్, భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగిసింది. ఇటీవలే కోచ్‌సహా సపోర్టింగ్ స్టాఫ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక ప్రకటననిచ్చింది. వెంటనే స్పందించిన రవిశాస్ర్తీ మరోసారి డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్, బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగార్ తమతమ దరఖాస్తులను బిసిసిఐకి పం పారు. కాగా, జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించే బాధ్యతను సంజయ్ బంగార్‌కు అప్పగించిన బిసిసిఐ కొత్త కోచ్ వేట లో పడింది. ఇలావుంటే, వరల్డ్ కప్ చాంపి యన్‌షిప్ కంటే ముందే డైరెక్టర్ పదవిని సృష్టించి మరీ రవిశాస్ర్తిని ప్రతిష్ఠించిన బిసిసిఐ అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు. వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ సమయంలో టీమిండియాకు ఫ్లెచర్ అధికారిక కోచ్‌గా వ్యవహరించగా, రవి శాస్ర్తి కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. అతనే కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తించాడు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఫ్లెచర్ కాంట్రాక్టు ముగియడంతో జట్టుకు కోచ్ గా వ్యవహరించాల్సిందిగా కోరుతూ రవిశాస్ర్తికి బిసిసిఐ అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇలావుంటే, మరోసారి టీమిం డియా వ్యవహారాలను చూసుకునే బాధ్యతను రవిశాస్ర్తి కే అప్పగించాలన్నది బోర్డు అభిప్రాయమని అంటున్నారు. హిందీ మాట్లాడడం వచ్చిన వారినే కోచ్‌గా నియమిస్తామని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ప్రకటించిన నేపథ్యంలో భారతీయుడినే ఈ పదవి వరిస్తుందన్న వాదన వినిపిస్తున్నది. డైరెక్టర్ హోదాలో రవిశాస్ర్తీని కూర్చోబెట్టి, అతనికి కీలక బాధ్యతలను కట్టబెట్టిన బిసిసిఐ ఇప్పుడు కొత్త కోచ్‌గా అతనినే ఎంపిక చేస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. డైరెక్టర్‌గా రవిశాస్ర్తీ అత్యుత్తమ సేవలు అందించాడని, అతని వల్లే భారత జట్టు మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే అతనికే కోచ్ పదవిని బిసిసిఐ అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇలావుంటే, కోచ్ పదవికి జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న మరో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పట్ల బిసిసిఐలోని ఒక వర్గం మొగ్గు చూపుతున్నదని సమాచారం. ఇప్పుడు రవిశాస్ర్తి తాను దరఖాస్తును సమర్పించానని ప్రకటించడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరికి బిసిసిఐ ఓటు వేస్తుందో చూడాలి.

chitram రవిశాస్ర్తీ