క్రీడాభూమి

రంజీలో హైదరాబాద్‌కు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: గుజ రాత్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2019-20లో భాగంగా మూడో రోజు బుధవారం హైదరాబాద్ జట్టు 159 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు గుజరాత్ తన మొద టి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ జట్టు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయ 239 పరుగులు చేయడంతో 159 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (96) త్రుటిలో సెంచరీ చేసే అవకాశం కోల్పోగా, అక్షంత్ రెడ్డి (45), బవనక సందీప్ (41) రాణించా రు. క్రీజులో వికెట్ కీపర్ కొల్ల సుమం త్ (130, తన్మయ్ త్యాగరాజన్ (10) ఉన్నారు. గుజరాత్ బౌలర్లలో రూష్ కలరియా, అక్షర్ పటేల్ రెండేసి వికె ట్లు పడగొట్టగా, చితన్ గజా, అర్జాన్ నగ్వాస్‌వాల్లా చెరో వికెట్ తీశారు.
ఎదురీదుతున్న ఆంధ్రా జట్టు
విజయవాడ: విదర్భతో జరుగుతు న్న మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఎదురీ దుతోంది.
బుధవారం రెండో ఇన్నింగ్ కు దిగిన ఆంధ్రా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పో య 130 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో ఓపెన్ జ్ఞానేశ్వర్ (42), రికీ భుల్ (14) ఉన్నారు. విదర్భ బౌలర్లలో రాజ్‌నీష్ గుర్బానీ, లలీత్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. అంతకుముం దు మొదటి ఇన్నింగ్స్‌లో విదర్భ తన మొదటి ఇన్నింగ్స్‌లో 441 పరుగుల కు ఆలౌటైంది.