క్రీడాభూమి

ఫామ్‌లోకి వస్తా యువరాజ్ సింగ్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 20: మళ్లీ ఫామ్‌లోకి వస్తానని, గతంలో మాదిరిగానే ఉత్తమ ఆటతో రాణిస్తానని ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టి-20 జట్టులో స్థానం సంపాదించుకున్న యువరాజ్ సింగ్ చెప్పాడు. కోల్‌కతా 25కె రన్‌కు హాజరైన అతను విలేఖరులతో మాట్లాడుతూ, చాలకాలంగా తాను చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని చెప్పాడు. అయితే, సమస్యలు తలెత్తిన ప్రతిసారీ తాను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడాన్ని అలవాటు చేసుకున్నానని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, జట్టులో మళ్లీ స్థానం సంపాదించిన ప్రతిసారీ ఒత్తిడి తప్పదని వ్యాఖ్యానించాడు. సెలక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సీజన్‌లో ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 398, ఐదు విజయ్ హజారే టోర్నీలో 341 చొప్పున పరుగులు చేసిన యువీ అన్నాడు. తనకు మళ్లీ జట్టులో స్థానం లభించడంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల పాత్ర కీలకమని అన్నాడు. వారంతా తనకు అండగా నిలబడి, ఏ దశలోనూ ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా చూశారని అన్నాడు. ఆసీస్ టూర్‌లో రాణించడమే తన లక్ష్యమని చెప్పాడు.