క్రీడాభూమి

విజయంతో ముగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, డిసెంబర్ 22: అంతా అనుకున్నట్లుగానే.. అందరూ ఊహించినట్లుగానే వెస్టిండీస్‌తో జరిగిన చివరి వనే్డలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు అద్భుతంగా రాణించారు. దీంతో మూడు వనే్డల సిరీస్‌ను 2-1 తేడాతో కోహీ లసేన కైవసం చేసుకుంది. సిరీస్‌తో పాటు బోనస్‌గా వరుసగా 10 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా కోహ్లీసేన సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మొత్తం మీద విజయంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలికింది.
విరుచుకుపడ్డ పొలార్డ్, పూరన్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈక్రమంలో ఎవిన్ లుయాస్ (21)ని రవీంద్ర జడేజా అవుట్ చేయగా, కొద్దిసేపటికే షైహోప్ (42) షమీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రోస్టన్ ఛేజ్ (38), షిమ్రన్ హెట్మాయర్ (37)లను యువ బౌలర్ నవదీప్ సైనీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 144 పరుగులకే విండీస్ 4 కీల క వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్, కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆరంభంలో నెమ్మదిగా పరుగులు రాబట్టినా, క్రీజులో కుదురుకున్నాక భార త బౌలర్లపై విరుచుకు పడ్డారు. 40 ఓవర్ల పాటు నెమ్మదిగా సాగిన ఆట స్వరూపాన్ని ఆ తర్వాత పూర్తిగా మార్చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవకాశమివ్వకుండా సిక్సర్లు, బౌండరీలతో దాడికి దిగారు. అయతే నికోలస్ పూరన్ (89) భారీ షాట్‌కు యత్నిం చి శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి 5వ వికెట్‌కు 135 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. మరోవైపు పొలార్డ్ (74, నాటౌట్), జాసన్ హోల్డర్ (97, నాటౌట్) చివరి నిమిషం వరకు సిక్సర్లతో విరుచుకుప డడంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 315 పరుగులు చేసింది. భారత బౌలర్లు చివరి 10 ఓవర్లలోనే 118 పరుగులు సమర్పించుకున్నారు. నవదీప్ సైనీ 2 వికెట్లు తీయగా, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.
చక్కని శుభారంభం..
భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు చక్కని శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌లు వికెట్‌ను కాపాడుకుంటూనే పరుగులను రాబట్టారు. కరేబియన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వని ఈ జోడీ క్రీజులో కుదరుకున్నాక బౌండరీలతో విరుచుకు పడింది. ఈ క్రమంలో ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ప్రమాద కరంగా మారిన ఈ జంటను జాసన్ హోల్డర్ విడదీశాడు. 22వ ఓవర్‌లో హోల్డర్ వేసిన రెండో బంతిని ఆడిన రోహిత్ శర్మ (63) షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 122 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో జతకట్టిన రాహుల్ (77) తనదైన రీతిలో చెలరేగాడు. అయతే కాసేపటికే అల్జారీ జొసెఫ్ బౌలింగ్‌లో షై హోప్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (7), రిషభ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) ఇలా వచ్చి అలా వెళ్లారు. అప్పటికీ భారత్ 5 వికెట్లు కోల్పోయ 286 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ కోహ్లీ దూకుడుగా కనిపించినా, వికెట్లు పడుతున్నా కొద్దీ ఆచితూచి ఆడాడు. రవీం ద్ర జడేజాతో కలిసి స్కోర్ బోర్డు బాధ్యతను భుజాన వేసుకు న్నాడు. ఈ క్రమంలోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకొని, సెంచరీ చేసేలా కనిపించిన విరాట్ కోహ్లీ (85) కిమో పాల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠ భరితంగా మారింది.