క్రీడాభూమి

శెభాష్ శార్దుల్, జడేజా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, డిసెంబర్ 22: కెప్టెన్ కోహ్లీ అవుటైన తర్వాత మైదానమంతా సైలెంట్‌గా మారింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్ ఠాకూర్ కాట్రెల్ వేసిన 48వ ఓవర్‌లో వరుసగా ఒక సిక్సర్, ఒక బౌండరీ బాదడంతో మ్యాచ్ తిరిగా భారత్ చేతిలోకి వచ్చింది. జడేజా కూడా చివరి వరకు క్రీజులో ఉండడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో కీమో పాల్‌కు 3 వికెట్లు లభించగా, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జొసెఫ్‌లకు తలో వికెట్ దక్కింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది.
రోహిత్ ఖాతాలో మరో రికార్డు..
విండీస్‌తో జరిగిన చివరి వనే్డలో రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. 22 ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును రోహిత్ చెరిపివేశాడు. ఒక క్యాలెండర్ ఈయర్ అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్‌గా సరికొత్త ఘనత అందుకున్నాడు. 1997లో శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య ఒక క్యాలెండర్ ఈయర్‌లో 2387 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ అందుకోపోగా, తాజాగా రోహిత్ దీనిని అధిగమించాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రోహిత్ శర్మ 2442 పరుగులు సాధించాడు.
వెల్‌డన్ షమీ..
ఈ ఏడాది క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ అరుదైన ఘనత సాధించాడు. షమీ మొత్తం 21 వనే్డల్లో 42 వికెట్లు పడగొట్టాడు. దీంతో రెండోసారి ఈ ఘనత సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. షమీ 2014లోనూ అత్యధిక వికె ట్లు తీశాడు. షమీ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (38), లాకీ ఫెర్గూసన్ (37) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (33), కుల్దీప్ యాదవ్ (32), యుజువేంద్ర చాహల్ (29) వరుసగా ఐదు, ఆరు. తొమ్మిది స్థానాల్లో నిలిచారు.
'చిత్రం...విజయం అనంతరం రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్‌ను అభినందిస్తున్న కెప్టెన్ విరాట్‌కోహ్లీ, మనీష్ పాండే