క్రీడాభూమి

విజయానికి మూడు వికెట్ల దూరంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, డిసెంబర్ 22: శ్రీలంకతో సొంత గడ్డపై జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ విజయం దాదాపు ఖాయమైంది. మరో మూడు వికెట్లు తీస్తే టెస్టు చాంపియన్ షిప్‌లో భాగం గా పాక్ బోణీ కొట్టనుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు చాంపియన్ షిప్ పట్టికలో పాక్ జట్టుకు 20 పాయంట్లు చేరిన విష యం తెలిసిందే. ఇదిలాఉంటే ఓవర్ నైట్ స్కోర్ 395 పరుగులతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి న పాక్ జట్టులో కెప్టెన్ అజార్ అలీ (118), బాబర్ అజామ్ (100, నాటౌ ట్) సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో పాకిస్తాన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు బ్యాట్స్‌మెన్లు సెంచరీలు చేయడం ఇదే మొదటి సారి. అంతకుముందు ఓపెనర్లు షాన్ మసూద్ (135), అబిద్ అలీ (174) సెంచరీలు చేశారు. పాకిస్తాన్ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయ 555 పరుగులు చేసింది. బాబర్ అజామ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ (21) నాటౌట్‌గా ఉన న సమయంలో డిక్లేర్ చేసింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లను కోల్పోయ 212 పరుగులు చేసింది. శ్రీలంక మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలంటే నేటి ఆటలో ఆలౌట్ కాకుండా ఉండాలి. అయతే ప్రస్తుతం ఓపెనర్ కుసల్ మెండీస్ (102, నాటౌట్) సెంచరీతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు 3 వికెట్లు తీస్తే పాక్ విజయం సాధించనుంది.