క్రీడాభూమి

బ్యాటింగ్‌తో సంతృప్తి చెందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, డిసెంబర్ 23: ఈ ఏడాది మొత్తం బ్యాటింగ్‌లో చాలా సంతృప్తి మిగిలిందని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతంలో కంటే 2019లో తాను ఆడిన ఆటతో ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం కటక్‌లో జరిగిన మూడోది, కీలకమైన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన ఈ ముంబయి ఆటగాడు, ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పేరిట గత 22 ఏళ్లుగా ఉన్న రికార్డును (2387) చెరిపేశాడు. రోహిత్ ఈ ఏడాది 2442 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఆడిన అన్ని ఫార్మాట్లలో రోహిత్ 10 సెంచరీలు చేశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో వనే్డ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌లో గెలిచిన ఆనందం కంటే టెస్టు ఇపుడు ఆటతీరుతో ఎంతో సంతృప్తి చెందుతున్నానని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నాకు అంతా కలిసి వచ్చింది. వనే్డ వరల్డ్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకున్న ఆనందం కంటే, ఇటు రెడ్ బాల్ గానీ అటు వైట్ బాల్‌తో గానీ ఆడిన ఆట కంటే ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో టీమిండియాలో అత్యధికంగా 258 పరుగులు సాధించడం ద్వారా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును పొందిన రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా ఈ ఏడాది బ్యాటింగ్‌తో నా ఆటతీరును బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఆనందాన్ని ఇప్పుడే ఆపలేను’ అన్నాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా సిద్ధంగా ఉన్నానని అన్నాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఐదు సెంచరీలు తన ఖాతాలో నమోదు చేసుకున్న రోహిత్ శర్మ ‘నా ఆటతీరు ఏమిటో నాకు బాగా తెలుసు. నా పరిమితులకు అనుగుణంగా ఆటలో రాణించాలని కోరుకుంటాను. జట్టు తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తూనే సమర్థవంతమైన పాత్రను పోషించాలని అభిలషిస్తాను’ అని పేర్కొన్నాడు. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు తానెల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పకనే చెప్పాడు. ప్రత్యర్థి ఎవరైనా టేబుల్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలవాలని, తద్వారా అభిమానుల మన్ననలను పొందాలని కోరుకుంటానని అన్నాడు. కాగా, వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన అత్యంత కీలకమైన వనే్డ ఆఖరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన తనకు సహకరించిన కేఎల్ రాహుల్‌తోపాటు శార్దూల్ ఠాకూర్ సైతం రోహిత్ శర్మ అభినందనలు తెలిపాడు.
'చిత్రం... రోహిత్ శర్మ