క్రీడాభూమి

చెక్ అథ్లెటిక్ మీట్‌లో లూకాకు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: మన దేశం తరఫున రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టింటు లూకా (27) చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో జరిగిన జోసెఫ్ ఓడ్లోజిల్ మెమోరియల్ అథ్లెటిక్ మీట్‌లో మహిళల 800 మీటర్ల రేసును 2:00.61 నిమిషాల్లో పూర్తిచేసి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేయడంతో పాటు రజత పతకాన్ని దక్కించుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్‌లో 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతక విజేత అనితా హిన్రిక్సోడవటిర్ (ఐస్‌లాండ్) 2:00.54 నిమిషాల్లో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించాలంటే లూకా తన ప్రతిభను ఇంకా ఎంతో మెరుగుపర్చుకోవలసి ఉంటుంది. ఈ సీజన్ టాప్ లిస్ట్‌లో ఆమె ప్రస్తుతం 30వ స్థానంలో ఉంది. ప్రపంచ మాజీ చాంపియన్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత కాస్టర్ సెమెన్యా (దక్షిణాఫ్రికా) 1:56.64 నిమిషాలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలువగా, ప్రపంచ ఇండోర్ చాంపియన్ ఫ్రాన్సినీ నియోన్సాబా (బురుండీ), రెనెల్లే లామోటే (ఫ్రాన్స్) వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.