క్రీడాభూమి

నిఖత్ జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్లుగానే ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో భాగంగా శనివారం నిర్వహించిన బాక్సింగ్ ట్రయల్స్‌లో భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై 9-1 తేడాతో విజయం సాధించింది. అయితే విజయం అనంతరం అభినందించేందుకు జరీన్ మేరీకి షేక్‌హ్యాండ్ ఇవ్వగా, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయతే ఈ విషయమై మ్యాచ్ అనంతరం మేరీకోమ్ మీడియాతో మాట్లాడారు. జరీన్‌తో నేనేందుకు చేతులు కలపాలి? ఇతరులు ఆమెను గౌరవించాలంటే ముందు ఆమె ఇతరులను గౌరవించాలని, అలాంటి స్వభావం కలిగిన వారంటే నాకు నచ్చరని ఘాటుగా స్పందించారు. మరోవైపు ఇదే విషయంపై జరీన్ మాట్లాడుతూ మేరీకోమ్ తనతో వ్యవహరించిన తీరు నచ్చలేదని, తను గెలిచిన అనంతరం ఆమెను తను హత్తుకోవాలని చూశానని చెప్పింది. అయితే మేరీ అందుకు నిరాకరించిందని, సీనియర్ల నుంచి జూనియర్లకు గౌరవం దక్కుతుందని తను ఆశించినట్లు జరీన్ పేర్కొంది.
''చిత్రాలు.. బౌట్‌లో తలపడుతున్న మేరీకోమ్, నిఖత్ జరీన్
*విజయం సాధించిన అనంతరం మేరీకోమ్