క్రీడాభూమి

ఈ ఏడాది అద్భుతంగా సాగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండేళ్లుగా ఆటకు దూరమై ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌ను నెగ్గి విశ్వవిజేతగా అవతరించింది చెస్ తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. రష్యాలోని మాస్కో వేదికగా శనివారం రాత్రి జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్ మహిళా విభాగంలో చైనా క్రీడాకారిణి లీ తింగ్ జీతో జరిగిన పోరులో ఆర్మగెడాన్ నిబంధన ప్రకారం విజేతగా నిలిచి, స్వర్ణం సాధించింది. ఈ విజయంతో విశ్వ విజేతగా నిలిచిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా 32 ఏళ్ల హంపీ రికార్డు సృష్టించింది. అయతే మ్యాచ్ అనంతరం మాట్లాడిన హంపి వాస్తవానికి టోర్నీకి ముందు తను పూర్తిస్థాయలో సన్నద్ధం కాలేదని ఫిడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. టోర్నీకి ముందు తాను విజేతగా నిలుస్తానని అనుకోలేదని, కాకపోతే తొలి మూడు స్థానాల్లో మాత్రం చోటు దక్కించుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. అయతే టైటిల్ నెగ్గడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఏడాది తనకు అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానిం చింది. ఇక క్లాసికల్ ఫార్మాట్‌లోనూ వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గాల నేది తన కల అని పేర్కొంది.
మ్యాచ్ మలుపు తిరిగిందిలా..
12 రౌండ్ల తర్వాత హంపి, లీ తింగ్ జీ (చైనా), అట్లికా ఎక్తెరీనా (టర్కీ) 9 పాయంట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టై బ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకులను ప్రకటించగా, హంపి (్భరత్), లీ తింగ్ జీ (చైనా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. హంపీ, లీ తింగ్ జీ మధ్య ప్రపంచ చాంపియన్‌ను నిర్ణయంచేందుకు మొదటగా రెండు బ్లిట్జ్ గేమ్‌లను నిర్వహించారు. టై బ్రేక్‌లోనూ ఇద్దరూ 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయంచేందుకు అర్మగేడాన్ గేమ్‌ను నిర్వహించారు.
ఈ నిబంధన ప్రకారం ఒకవేళ మ్యాచ్ డ్రా అయతే నల్ల పావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగేడాన్ గేమ్‌ల్ హంపి గేమ్‌ను డ్రా చేసుకోవడంతో ప్రపంచ చాంపియ న్‌గా అవతరించింది. ఇక పురుషుల విభాగంలో నార్వే చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్ చాంపియన్‌గా అవతరించాడు. కార్ల్‌సన్‌కు ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలవడం మూడోసారి. గతంలోనూ 2014, 2015లోనూ చాంపియన్‌గా అవతరించాడు.
''చిత్రాలు.. ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి
*ఫిడే ర్యాపిడ్ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)