క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో కుమిల్లా వారియర్స్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, డిసెంబర్ 31: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చాటో గ్రామ్ చాలెంజర్స్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠ పోరులో కుమిల్లా వారియర్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముం దు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చా టోగ్రామ్ చాలెంజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 159 పరుగులు చేసింది.
ఓపెనర్ లెండీ సిమన్స్ (54), జునైద్ సిద్దిఖ్ (45), జియా-ఉర్- రహ్మాన్ (34. నాటౌట్) రాణించారు. సౌమ్యా సర్కార్‌కు రెండు వికెట్లు దక్కగా, ఆల్-అమిన్-హుస్సేన్, డేవిడ్ వైస్, సుంజాముల్ ఇస్లాంలు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో కుమిల్లా వారియర్స్ చివరి బంతికి విజయం సాధించింది. కెప్టెన్ డేవిడ్ మలాన్ (74) అర్ధ సెంచరీతో రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.