క్రీడాభూమి

పునరుద్ధరణ దిశగా ఎన్‌సీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆటగాళ్ల గాయాల్లో తరుచూ విమర్శలు ఎదుర్కొంటున్నా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పునరుద్ధరణ ప్రణాళికల్లో భాగంగా బీసీసీఐ మెడికల్ ప్యానెల్, సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఎన్‌సీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు ఆఫీస్ బేరర్లు, ఎన్‌సీఏ అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్ ఈ సమా వేశంలో పాల్గొన్నారు. గాయాలపాలైన వృద్ధిమాన్ సాహా, భువ నేశ్వర్ కుమార్ సహా పలువురు భారత ఆటగాళ్ల గాయాల నిర్వ హణపై ఎన్‌సీఏ చేసిన విమర్శల తర్వాత బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగింది. అంతకుముందు గాయాల బారిన పడిన భారత స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా కొలుకు నేందుకు ఎన్‌సీఏ నుంచి కాకుండా వ్యక్తిగత ట్రైనర్ల సాయం తీసుకోవడంపైనా ఎన్‌సీఏ విమర్శల పాలైన విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటున్న అందులోని ఓ ఉన్నతాధికారి పేర్కొనడం గమనార్హం. మెడికల్ ప్యానెల్ ఏర్పాటుకు తర్వలోనే లండన్‌ని పోర్టిస్ క్లినిక్‌తో సం ప్రదింపులు జరుపుతున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. దీం తో పాటు ఎన్‌సీఏకు వచ్చే ఆటగాళ్ల కోసం ఓ న్యూట్రీషియన్ ను కూడా నియమించనున్నట్లు తెలిపాడు. ఎన్‌సీఏపై ఎప్పటికప్పు డు వివరాలను సోషల్ మీడియా మేనేజర్ అందజేస్తారని చెప్పా రు. మెడికల్ ప్యానెల్ ఏర్పాటుకు 18 నెలలు పడుతుంద ని, మిగిలిన పోస్టుల భర్తీని త్వరలోనే చేపడుతామని పేర్కొన్నాడు.