క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్ గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 4: టీమిండి యా ఆటగాడు, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల పఠాన్ తన క్రికెట్ కెరీర్‌లో ఎన్ని రికార్డులు సాధించాడు. 2006లో పా కిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెట ర్‌గా ఇర్ఫాన్ నిలిచాడు. అలాగే 2007 లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు 2003లో లాహోర్ జరిగిన యూత్ వనే్డల్లో ఏకంగా 16 పరుగులిచ్చి 9 వికెట్లను తీశాడు. అయతే తరుచూ గాయాలు వేధించ డంతో అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్నా ళ్లుగా ఎంపికవలేదు. చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కాశ్మీ ర్ తరఫున ఆడాడు. 2012 అక్టోబర్‌లో ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచే పఠాన్‌కు చివరిది. ఇర్ఫాన్ అంతర్జాతీ య కెరీర్‌లో 29 టెస్టుల్లో 1105 పరు గులతో పాటు 100 వికెట్లు తీసుకో గా, 120 వనే్డల్లో 1544 పరుగులు చేసి 173 వికెట్లు తీశాడు. అలాగే పొట్టి ఫార్మాట్‌లో 24 మ్యాచ్‌లాడి 172 పరు గులతో పాటు 28 వికెట్లను తన ఖా తాలో వేసుకున్నాడు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో వచ్చిన ఇర్ఫాన్ పఠాన్ ఆ సమ యంలో టీమిండియా పేస్ విభాగాని కి వెన్నుమక నిలిచాడనడంలో ఎలాం టి సందేహం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పఠాన్ తప్పుకుంటున్న ట్లు ప్రకటించిన వెంటనే పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు.
'చిత్రం... టీమిండి యా ఆటగాడు, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్