క్రీడాభూమి

టార్గెట్ వైట్‌వాష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 8: చారిత్రక లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టులో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై వైట్‌వాష్ సాధించడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగనుంది. నిరుడు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, ఆ సిరీస్ చివరి మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అప్పటికే సిరీస్‌ను గెల్చుకున్న కారణంగా చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా ఆడారని, ఫలితంగా పరాజయాన్ని చవిచూశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడ్డాయి. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇంగ్లాండ్ జాగ్రత్త పడుతున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసి సిరీస్‌ను గెల్చుకున్న కారణంగా, చివరి మ్యాచ్‌కి ప్రాధాన్యతను కోల్పోయింది. అయితే, సిరీస్ విజయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా ఎంచుకున్న ఇంగ్లాండ్ సర్వశక్తులు ఒడ్డి పోరాడనుంది.
లంకకు ప్రాణసంకటం
ఇంగ్లాండ్‌కు చెలగాటం లంకకు ప్రాణసంకటం అన్న చందంగా మా రింది పరిస్థితి. వైట్ వాష్ కోసం ఇంగ్లాండ్ ప్రయత్నిస్తుంటే, చివరి టెస్టును గెల్చుకోవడం ద్వారా పరువు నిలబెట్టుకోవాలని లంక ఆరాటపడుతున్నది. ఇప్పటికే ఈ జట్టు వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో 120 కంటే తక్కువ పరుగులు చేసింది. 1958లో న్యూజిలాండ్ తర్వాత ఒక జట్టు వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో ఈ విధంగా విఫలం కావడం ఇదే మొదటిసారి. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలిన లంక ఫాలోఆన్ ఆడుతూ రెండు ఇన్నింగ్స్‌లో 119 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌ని కూడా కోల్పోయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 475 పరుగులు సాధించడం ద్వారా ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకుంది. గురువారం నుంచి మొదలయ్యే చివరి టెస్టును గెల్చుకొని లేదా కనీసం డ్రాతో, వైట్‌వాష్ ప్రమాదం నుంచి లంక బయటపడుతుందో లేదో చూడాలి.