క్రీడాభూమి

పీలే వరల్డ్ కప్ ట్రోఫీకి రూ. 3.8 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 9: బ్రెజిల్‌కు చెందిన ‘లెజెండరీ సాకర్ ఐకాన్’ పీలే 1970లో సాధించిన వరల్డ్ కప్ ట్రోఫీకి ఇక్కడ జరిగిన వేలంలో 5,70,000 డాలర్లు (సుమారు 3.8 కోట్ల రూపాయలు) లభించాయి. 1970 మెక్సికో వరల్డ్ కప్‌లో బ్రెజిల్ విజయభేరి మోగించింది. ఆ జట్టులో సభ్యుడైన పీలే మిగతా ఆటగాళ్లతోపాటు వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని అందుకున్నాడు. లాస్ ఏంజిలిస్ ఆక్షన్ హౌస్ పేరుమీద లండన్‌లో నిర్వహించిన వేలంలో 75 ఏళ్ల పీలే 1958, 1962, 1970 సంవత్సరాల్లో బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా తాను సాధించిన మూడు వరల్డ్ కప్ ట్రోఫీలను అమ్మకానికి ఉంచాడు. వీటిలో 1958 ట్రోఫీ సుమారు 1.93 కోట్ల రూపాయలకు అమ్ముకాగా, 1962 ట్రోఫీకి 1.35 కోట్ల రూపాయలు దక్కాయి. మూడో ట్రోఫీకి 3.8 కోట్ల రూపాయలు లభించగా, పీలే సాధించిన మూడు వరల్డ్ కప్ ట్రోఫీల వేలం ప్రక్రియ ముగిసింది. ప్రముఖ నటుడు మైఖేల్ కెయిన్, ఇంగ్లాండ్‌కు వరల్డ్ కప్‌ను సాధించిపెట్టిన కెప్టెన్ బాబీ మూర్ కూడా నటించిన ‘ఎస్కేప్ టు విక్టరీ’ చిత్రంలో పీలే ధరించిన బూట్లకు వేలంలో భారీ ధర పలుకుతుందని ఆశించారు. కానీ, ఆ బూట్లకు 7.72 లక్షలు మాత్రమే లభించాయి. 1957-1971 మధ్యకాలంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ క్లబ్ సాంటోస్‌కు ప్రాతినిథ్యం వహించిన పీలే తన కెరీర్‌లో మొత్తం 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ సాధించాడు. బ్రెజిల్ తరఫున 91 మ్యాచ్‌లు ఆడాడు.

వరల్డ్ కప్‌ ట్రోఫీతో పీలే (file photo)